సమరోత్సాహంతో పనిచేద్దాం శ్రేణులకు కాలవ పిలుపు

Kranthi
2 Min Read

సమరోత్సాహంతో పనిచేద్దాం
శ్రేణులకు కాలవ పిలుపు

 

రాయదుర్గం జనసేన ప్రతినిధి మార్చి 23

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి విజయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన రాయదుర్గం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న తీవ్రమైన వ్యతిరేకత, చంద్రబాబునాయుడి పాలన రాష్ట్రానికి అవసరమనే ప్రజల బలమైన కోరిక వల్లే పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిందన్నారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పరిధిలో ఉన్న 38 నియోజకవర్గాల్లో వైసీపీకున్న వ్యతిరేకత తాజా ఫలితంతో స్పష్టమైందన్నారు. జగన్ సొంత జిల్లా కడపలో కూడా వైసిపి ఘోరంగా ఒడిపోవడం టీడీపీకి శుభపరిణామన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఓట్ల నమోదు కార్యక్రమం నుండి ప్రచారం వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా పనిచేయడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. ఇదే ఉత్సాహంతో 2024 సాధారణ ఎన్నికల్లో రాయదుర్గంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కంకణబద్ధులు కావాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక విజయంలో భాగస్వాములైన పార్టీ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నగల్లీ రాజు, పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, మండల కన్వీనర్లు లాల్లేప్ప, కురుబ హనుమంతు, కురుబ గిరిమల్లప్ప, హనుమంత రెడ్డి, రాష్ట్ర మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి సంపత్ కుమారి, క్లస్టర్ ఇంఛార్జీ, కాదలూరు మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పోరాళ్ల పురుషోత్తం, జిల్లా వాణిజ్య అధ్యక్షుడు గాజుల వెంకటేశులు, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు కడ్డిపూడి మహాబుబ్ బాషా, క్లస్టర్ ఇంఛార్జీలు ఇనాయత్, కాలవ సన్నన్న, కేపి దొడ్డి నాగరాజు, ధానవేంద్ర, ఆనంద రాజు, పూజారి తిప్పయ్య, వేణు, కరెన్న, నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with