మోటర్ బైక్ ఢీకొన్న సంఘటన, తీవ్ర గాయాలు 

Kranthi
1 Min Read
  • నరవ ఏఎంజి కాలనీ సమీపంలో కారు, మోటర్ బైక్ ఢీకొన్న సంఘటన, తీవ్ర గాయాలు 

 

గంట్యాడ, ఫిబ్రవరిO4, జనసేన ప్రతినిధి: గంట్యాడ మండలంలోని నరవ ఏఎంజీ కాలనీ సమీపంలో రహదారిపై ఆదివారం రాత్రి కారు, మోటార్ బైకు ఢీకొన్న సంఘటనలో మోటార్ సైక్లిస్ట్ కు తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్ర గాయాలైన మోటార్ సైకిల్ వివరాలు తెలియవలసి ఉంది. గంట్యాడ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న మోటార్ బైక్, విజయనగరం నుంచి గంట్యాడ వైపు వస్తున్న కారు 48 కాలనీ సమీపంలో రహదారిపై ఢీకొన్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న గంట్యాడ 108 వాహన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108వాహనంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Share This Article
Leave a Comment

Share with