రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారికి ఓటు వేయాలి.

Kranthi
2 Min Read
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారికి ఓటు వేయాలి.

 

గజపతినగరం: ఫిబ్రవరి04, జనసేన ప్రతినిధి:గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జి , మాజీ ఎమ్మెల్యే *డా.కే.ఏ.నాయుడు* సూచనల మేరకు ఈ రోజు ఉదయం10 గంటలకు గజపతినగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో MyFirstVoteForCBN అనే పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా *పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు వేమలి చైతన్య బాబు, క్లస్టర్ ఇన్చార్జి వైకుంఠం ప్రదీప్ కుమార్* మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల పది నెలల పరిపాలనలో రాష్ట్రాన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ కూడా కనపడదని అవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి విద్యార్థుల కోసం అనేక విద్యాసంస్థలు తీసుకొని రావడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, యువత కోసం అనేక పరిశ్రమలు తీసుకొచ్చారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించారని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయక పోవడమే కాకుండా, కొత్త పరిశ్రమలు తీసుకుపోగా ఉన్నవాటిని తరమడం వలన నిరుద్యోగ యువత రోడ్డున పడ్డారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు యువతను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని,పేజీ విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రీ ఇంబర్స్మెంట్ రద్దు చేశారని, విదేశీ విద్యను ఎత్తివేశారనీ అన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం విద్యార్థులు, యువత, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న వారు కులమతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు కి మద్దతు ఇవ్వాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్ము నాయుడు, MyFirstVoteForCBN ప్రచార కమిటీ సభ్యులు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు పెదిరెడ్ల సతీష్, ఉపాధ్యక్షులు సాలాపు లక్ష్మణ, TNSF నాయకులు మంత్రి గణపతిరావు, మండల తెలుగుయువత అధ్యక్షులు పొట్నూరు అప్పలస్వామి, తెలుగుయువత పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి సుంకరి చిన్నం నాయుడు, పార్టీ నాయకులు ఎర్ర కృష్ణ , సత్తిబాబు, గొల్లు దేవుడు బాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with