వడగండ్ల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు

Kranthi
1 Min Read

*వడగండ్ల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి*:

*టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు*

అనంతపురం జనసేన ప్రతినిధి మర్చి 23 :సింగనమల నియోజకవర్గం నార్పల,సింగనమల,పుట్లూరు బుక్కరాయసముద్రం,గార్లదిన్నె,తదితర మండలాల్లో మొన్నటి రోజున కురిసిన వడగండ్ల వర్షానికి అరటి, మొక్కజొన్న,వరి,చీని,మామిడి,టమోటా,కర్బూజా తదితర పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి సుమారు 200 కోట్ల రూపాయలు పైగా నష్టం జరిగింది కాబట్టి వెంటనే పంట నష్టం అంచనా వేసి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజుఆర్డిఓ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గంలోని రైతులు తీవ్రంగా నష్టపోతే స్థానిక ఎమ్మెల్యే కనీసం పరామర్శించే సమయం కూడా లేకపోవడం అదేవిధంగా సంబంధిత వ్యవసాయశాఖ మంత్రి ఇంతవరకు కూడా స్పందించకపోవడం ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో కనీసం నష్టపోయిన రైతుల గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం చాలా దారుణం.రైతన్నలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈరోజు అదే రైతు కన్నీరు కారుస్తుంటే ఎక్కడున్నాడు ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. వారం రోజుల్లో నష్టపోయిన ప్రతి రైతన్నలకు నష్టపరిహారాన్ని ప్రకటించకపోతే భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఆర్టీవో వెంటనే స్పందించి త్వరలోనే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మి నరసింహ పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with