వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం బీఆర్ఎస్ పోరు మొదలు-త్వరలో కేసీఆర్ సభ: తోట చంద్రశేఖర్ వెల్లడి..

Bujji
1 Min Read

వైజాగ్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 11: ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్.. అన్నట్లుగానే ఇవాళ పోరు మొదలుపెట్టేసింది. ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ తోట చంద్రశేఖర్ ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారో వారికి వివరించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసి సమరశంఖారావం పూరిస్తారన్నారు. తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ శక్తులకు దొడ్డిదారిన కట్టబెట్టాలని చూస్తే భారత రాష్ట్ర సమితి మహాపోరాటానికి శ్రీకారం చుడుతుందని పార్టీ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ స్పష్ఠం చేశారు.

Share This Article
Leave a Comment

Share with