RCB vs LSG: బెంగళూరులో ఆర్సీబీ సిక్సర్ల వర్షం..

Bujji
1 Min Read

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) టీమ్ మరోసారి బ్యాటింగ్‌లో చెలరేగిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్‌ (Lucknow Super Giants)తో సోమవారం రాత్రి అక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టీమ్‌లోని టాప్-3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ (61: 44 బంతుల్లో 4×4, 4×6), డుప్లెసిస్ (79 నాటౌట్: 46 బంతుల్లో 5×4, 5×6), గ్లెన్ మాక్స్‌వెల్ (59: 29 బంతుల్లో 3×4, 6×6) సిక్సర్ల వర్షం కురిపించేశారు. లక్నో బౌలర్లలో మార్క్‌వుడ్, అమిత్ మిశ్రా చెరో వికెట్ పడగొట్టారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఫస్ట్ నుంచే భారీ షాట్లు ఆడేశాడు. మార్క్‌వుడ్, అవేష్ ఖాన్ బౌలింగ్‌ని పవర్ ప్లేలో ఉతికారేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ టీమ్ స్కోరు 96 వద్ద అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం డుప్లెసిస్ జోరందుకోగా.. గ్లెన్ మాక్స్‌వెల్ స్లాగ్ ఓవర్లలో గేర్ మార్చి చెలరేగిపోయాడు. దాంతో ఈ జోడి రెండో వికెట్‌కి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

లెప్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌ని టార్గెట్ చేసిన డుప్లెసిస్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టగా.. అవేష్ ఖాన్‌‌ని మాక్స్‌వెల్ చితక్కొట్టేశాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే మాక్స్‌వెల్ 50 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో మార్క్‌వుడ్‌ మాత్రమే కాస్త కంట్రోల్‌గా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా కూడా ఓవర్‌కి 9 పరుగులు చొప్పున సమర్పించుకున్నారు.

Share This Article
Leave a Comment

Share with