బొండపల్లిలో నాలుగో విడత ఆసరా సంబరాలు

Kranthi
1 Min Read

బొండపల్లిలో నాలుగో విడత ఆసరా సంబరాల

 

బొండపల్లి, ఫిబ్రవరి04, జనసేన ప్రతినిధి : బొండపల్లి భువి లేఔట్ లో ఆదివారం నాలుగు వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయిన్ లు అని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు.

నాలుగో విడత ఆసరా సంబరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం శ్రమించిన జగన్ ను తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, ఎంపీపీ చల్ల చలంనాయుడు, జడ్పిటిసి సూర్యప్రకాశరావు, వైసీపీనేతలు బి.వి. ప్రభూజీ రాజు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with