వేణి ఫౌండేషన్ సేవలు అభినందనీయం: తోలేటి

Bujji
1 Min Read

  అమలాపురం, జనసేన ప్రతినిధి, ఏప్రియల్ 10: ప్రధానమంత్రి మాతా సురక్షణ పథకంలో భాగంగా పి. గన్నవరంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వై. కొత్తపల్లికి చెందిన వేణి ఫౌండేషన్ ప్రతి నెలా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం అభినందనీయం అని పి.గన్నవరం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు తోలేటి బంగారు నాయుడు అన్నారు గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగించడం వారి నిబద్ధతకు, దాతృత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు . ఇటువంటి కార్యక్రమాలవల్ల ఎంతో మంది స్ఫూర్తి పొంది మరెన్నో సామాజహిత కార్యక్రమాలను ప్రారంభించడానికి ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు. వేణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న వై. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ శ్రీ తోరం సత్యనారాయణ, నల్లా పెద్దకాపు తదితరులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. జివి సురేష్, డా. అన్నాజీ రావు, వేణి ఫౌండేషన్ ఛైర్మన్ నల్లా గంగా ఈశ్వరరావు, నల్లా ఫణికుమార్ నల్లా హారిత, తిక్కిరెడ్డి లక్ష్మి భవాని,వారి కుటుంబ సభ్యులు, వేణి ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with