వైసీపీ ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా ములకలచెరువు సబ్ స్టేషన్ ను ముట్టడించిన టిడిపి నాయకులు

Bujji
1 Min Read

అన్నమయ్య జిల్లా,  జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: టిడిపి పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు ఆదేశాల మేరకు తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనభ్యులు శంకర్ యాదవ్ సూచనల మేరకు రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ మొలకలచెరువు మండల కన్వీనర్ పాలగిరి సిద్దా ఆధ్వర్యంలో మొలకలచెరువు మండల కేంద్రం లోని సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్ పాలగిరి సిద్దా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందని దీనిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి రావడానికి కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యతరగతి వారి బ్రతుకులను చినాభిన్నం చేస్తుందని ఇలాంటి ప్రభుత్వం మనకి అవసరమా అంటూ వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ అధికారంలోకి రావాలని పాలగిరి సిద్ధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు, మాజీ జెడ్పీటీసీ, గ్రామ కమిటీ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, తెలుగు యువత, రైతు కమిటీ, అనుబంధ కమిటీ మహిళా నాయకులు ఇతర అనుబంధ కమిటీల నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with