కొమరాడ మండలంలో మన ఇల్లు – మన గౌరవం…

Bujji
1 Min Read

 

పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండల, జనసేనప్రతినిధి: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా తీసుకున్న మన ఇల్లు -మన గౌరవం కార్యక్రమాన్ని మండలంలో కొమరాడ మండల కేంద్రం తో పాటు అన్ని ప్రాంతాల వారీగా సచివాలయం మరియు లేఔట్ల్లో లబ్దిదారుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది, దీని ముఖ్య ఉద్దేశం రెండూవేల ఇరవై ఐదు పిబ్రవరి నాటికి ఇల్లు నిర్మించుకున్నవారికి బిల్లులు చెల్లింపు జరుగునని తరువాత బిల్లులు చెయ్యలేమని ప్రభుత్వం ఆదేశాలు మేరకు సచివాలయ సిబ్బంది, పంచాయితీ నాయకులు తో అవగాహనకల్పించడం జరిగింది, ఇనుము, సిమ్మెంట్, ఇసుక ప్రభుత్వం సరఫరా చేస్తుందని నిత్మణంలోనూ బిల్లులు జాప్యంలోనూ సమస్యలు ఉన్న గృహనిర్మాణ సంస్థ కి తెలియ చేయవలసిందిగా అధికారులు కోరారు, మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం లో మండల స్పెషల్ ఆఫీసర్, యమ్. పి. డి. ఒ.,
హౌసింగ్ ఏ. ఇ, వర్క్ ఇన్స్పెక్టర్, సహాయకులు గ్రామపెద్దలు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with