రోడ్డు భద్రతమాసోస్తవాలు వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్

Kranthi
1 Min Read

రోడ్డు భద్రతమాసోస్తవాలు వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్

తనకల్లు, ఫిబ్రవరి6,జనసేన ప్రతినిధి:

తనకల్లు మండలంలోని బస్టాండ్ కూడలిలో, కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోస్తవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎం వి ఐ వరప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలని , దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతోందని, వాపోయారు రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు.

ఈ రోడ్డు భద్రత మాసోస్తవాలు లో భాగంగా నేడు తనకల్లులో ఉన్న వాహన డ్రైవర్ల అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

Share This Article
Leave a Comment

Share with