నమ్మి ఓటు వేశారు 30సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళింది

Kranthi
1 Min Read
  • జగన్ మోస మాటలు నమ్మి ఓటు వేశారు 30సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళింది*
  • జనసేన టీడీపీ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి
  • మహిళలు ఆలోచించి ఓటువేసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు దోహద పడాలి
  • 8వ డివిజన్ లో 21వ రోజు కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04:ఆదివారం నాడు జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 8వ డివిజన్ రాణి నగర్ నందు 21వరోజు మహిళలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలతో మమేకమై మాట్లాడుతూ జగన్ మాయమాటలు నమ్మి ఓటు వేసినందుకు రాష్ట్రం 30 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి వెళ్లిందని ,

కనుక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్నిరంగాలు పురోగమించాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యమవుతుందని జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలిపాడని యువతకు ఉద్యోగాలు కూడా లేవని కనుక ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ పార్టీలకే ఓటు వేయాలని కోరుతూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో లోని ముఖ్యంశాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,

తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేళ రూపాయలు దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3గ్యాస్ సిలిండర్లు 20లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను వివరిస్తూ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని వీటితో పాటు స్థానిక డివిజన్ లో మంచినీటి సరఫర, వీధిదీపాలు,ము తుగుకాలువలు రహదారులు సరిగా లేవని అన్నారు ఈ కార్యక్రమంలో వీర మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Share This Article
Leave a Comment

Share with