కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

Kranthi
1 Min Read

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

 

అనంతపురం జనసేన ప్రతినిధి డిసెంబర్ 02:అనంతపురంలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర వివాదాస్పదంగా మారింది. బొమ్మనహాల్ మండలం కలగల గ్రామానికి చెందిన సుధ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని కళాశాల యాజమాన్యం తెలిపింది. మెడపై గాట్లు తప్ప శరీరంపై ఎక్కడా గాయాలు లేకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని కళాశాల సిబ్బందే ఏదో చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆసుపత్రికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share This Article
Leave a Comment

Share with