ప్రతీ మంగళవారం డయల్ యువర్ ఎస్పీ… మొబైల్ ట్రాక్ ద్వారా రికవరీ చేసిన సెల్ ఫోన్లు అప్పగింత

Bujji
1 Min Read

కాకినాడ, క్రైమ్, జన సేన ప్రతినిధి,జూన్ 13: వివిధ కారణాలతో పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్ఫో న్లకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుని వాటిలో కొన్నింటిని మొబైల్ ట్రాక్ ద్వారా రికవరీ చేసి సెల్ఫోన్ యజమానులకు అప్పగించామని, అలాగే ప్రతీ మంగళవారం తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 11 నుండి 12గంటల వరకు డయల్ యువరు ఎస్పీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు.


మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసులు చేపట్టిన మొబైల్ ట్రాక్ ద్వారా పోగొట్టుకున్న సెల్ఫోన్లను సేకరించి వాటిని తిరిగి ఆ ఫోన్ యజమానులకు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే అలాగే తమ సమస్యలను 0884- 2371744 కి ఫోన్ చేసి చెప్పే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ టాక్ సిస్టమును గత ఫిబ్రవరిలో ప్రారంభించామని ఇందులో మొదటి విడతగా 249 ప్రస్తుతం 231కి కలిపి మొత్తం 570 సెల్ ఫోన్లను రికవరీ చేసి వాటిని యజమానులకు అందించామని చెప్పారు. కాకినాడ జిల్లా ఐటీ కోర్ బృందం సహకారంతో పోగొట్టుకున్న సుమారు 40 లక్షల విలువ గల సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం డయల్ యువర్ ఎస్పి అనే గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సమావేశం జిల్లా అదనపు ఎస్పి పి శ్రీనివాస్, కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ సిహెచ్ రామకోటేశ్వర్రావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ పి ఈశ్వరుడు, ఐటీ కోర్ ఎస్సై డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with