ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన​

Kranthi
1 Min Read

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన​ –

 


===
తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. దీని వలన విశాఖపట్నం నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరంతో పాటుగా పార్వతీపురం మణ్యం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నేడు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం మధ్యలో పడనుంది. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉండనుంది. ఎం.జే.వో. ఇప్పుడు బంగాళాఖాతంలో కొనసాగుతోంది, అది మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో భారీ వర్షాలను, పిడుగులకు కావాల్సిన శక్తిని ఇస్తుంది.

అలాగే ఎన్.టీ.ఆర్., పల్నాడు, బాపట్ల​, గుంటూరు, ప్రకాశం (కోస్తా భాగాలు), నెల్లూరు, తిరుపతి, కడప​, అన్నమయ్య, నంధ్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూడగలము.

Source :Ap weather man

Share This Article
Leave a Comment

Share with