అంగన్వాడి కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే

Bujji
1 Min Read

జనసేన ప్రతినిధి, బెల్లంపల్లి, ఏప్రిల్ 28 : బెల్లంపల్లి పట్టణ హనుమాన్ బస్తి 33 వ వార్డు లో నంబర్ 2 అంగన్వాడి కేంద్రంలో టీచర్ పద్మావతి స్కూల్ పిల్లలతో అంగన్వాడి గ్రాడ్యుయేషన్ స్కూల్ డే నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డ్ కౌన్సిలర్ పోలు.ఉమాదేవి శ్రీనివాస్ హాజరై స్కూల్ పిల్లలకు అంగన్వాడి గ్రాడ్యుయేషన్ స్కూల్ పట్టాలను అందజేశారు,ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉమాదేవి మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులందరూ తమ తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలని,పిల్లలు చదివితే భవిష్యత్తులో ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్స్ లాయర్స్ పోలీసులుగా తయారైతే దేశ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతారని ఈ సందర్భంలో పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు అనంతరం పోషకాహారం,బాలామృతం, కోడిగుడ్లు,పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with