మూర్తిగారి జనార్ధన్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శం

Kranthi
1 Min Read

మూర్తిగారి జనార్ధన్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శం
కొడారి వెంకటేష్. సామాజిక కార్యకర్త


యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఏప్రిల్ 7 :
ఏదీ గుడ్డిగా నమ్మకుండా, దాన్ని అధ్యయనం చేసి, తెలుసుకొని  ఆచరించాలనే  మూర్తిగారి జనార్థన్ ఆలోచన నేటి యువతకు ఆదర్శం కావాలని  సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం స్థానిక రెడ్డివాడలోని మూర్తిగారి జనార్ధన్ గృహములో జరిగిన మూర్తి గారి జనార్థన్ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ మూర్తి గారి జనార్థన్ అనేక సంస్థలకు చెందిన  పుస్తకాలను , సాహిత్యాన్ని  అధ్యయనం చేసి అందులోని  విజ్ఞానాన్ని, హేతువాద దృక్పథం మరియు మానవత్వాన్ని  కవితలుగా, శీర్షికలుగా, వ్యాసాలుగా వ్రాసి పత్రికలకు పంపిచేవారని ఆయన అన్నారు.

మూర్తిగారి జనార్థన్ తన జీవితాంతం వందలాది పుస్తకాలు అధ్యయనం చేసారని ఆయన గుర్తుచేశారు. మూర్తిగారి జనార్థన్ ఆశయాలు చాలా గొప్పవని, వాటిని నేటి తరం తప్పక ఆచరించాలని ఆయన కోరారు.  జనార్థన్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాసాచార్యులు, జిట్టా భాస్కర్ రెడ్డి, షేక్ హమీద్ పాషా, బోగ మల్లేష్ మూర్తి గారి జనార్థన్ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with