టిడిపి నాయకుల పై వచ్చిన వార్త ను ఖండించిన టిడిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుమార్..

Kranthi
1 Min Read

టిడిపి నాయకుల పై వచ్చిన వార్త ను ఖండించిన టిడిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుమార్..

  • జనాలలో టిడిపికి వస్తున్న ఆదరణ ఓర్వ లేక కుట్రపన్నీ పత్రికలో తప్పుడు ప్రచారం..

అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 7 తంబళ్లపల్లి / – స్థానిక నియోజకవర్గ పరిధిలోని బి. కొత్తకోట పట్టణంలో కొందరు టిడిపి నాయకులు, స్థానిక జిరాక్స్ షాప్ యజమానులతో ఏకమై పట్టణ ప్రజలను మభ్యపెడుతున్నారని వచ్చిన కథనంపై వైసిపి కి చెందిన కొంతమంది యువత తప్పుడు సమాచారం ఇవ్వడంతో టిడిపి కి చెందిన కొంతమంది నాయకుల పై తప్పుడు వార్త ప్రచురించినందున వారిని క్షమాభిక్ష కోరుతున్నట్లు పాత్రికేయుడు వారికి వివరణ ఇచ్చారు.

తెలిసో తెలియక తప్పుడు సంకేతాలు పత్రికలో రావడం చాలా బాధాకరంగా ఉందని ఇంతకుముందు ఎన్నడూ తప్పుడు వార్తలు ప్రచురించలేదని టిడిపి నాయకులను కోరారు. టిడిపి ఆచరించిన మేనిఫెస్టో ప్రజలకు ఆశాజనకంగా ఉందని కొంతమంది తప్పుడు సంకేతాలు ఇస్తూ టిడిపి పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లకూడదని కుట్రలు చేస్తున్నారని అలాంటివి ప్రజలు ఎవరూ నమ్మ వద్దని టిడిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సుకుమార్, కుడుము శ్రీనివాసులు ప్రజలకు తెలిపారు. రాబోవు ఎన్నికలలో టిడిపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి ఆచరించిన మేనిఫెస్టో నే టిడిపి పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని టిడిపి నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్ మెంట్ కోఆర్డినేటర్
కుడుం శ్రీనివాసులు, మండల కన్వీనర్ నారాయణస్వామి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బంగారు వెంకట రమణ, కష్టర్ ఇంచార్జీ కనకంటి ప్రసాద్, ఆలేటిపల్లి శ్రీనాథ్, నర్సింహులు, మండల తెలుగు యువత అద్యక్షుడు రాజ, కుడుం శరత్, రంజిత్ దేవుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with