విశాఖలో హై అలెర్ట్. కంట్రోల్ రూములు ఏర్పాటు.

Kranthi
1 Min Read

మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో విశాఖలో హై అలెర్ట్. కంట్రోల్ రూములు ఏర్పాటు.

కలెక్టరేట్ కంట్రోలు రూం నెంబర్లు: 0891- 2590102, 0891-2590100., జివిఎంసి : టోల్ ఫ్రీ నెం. 180042500009, కంట్రోల్ రూమ్ నెం. 0891-2869106.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలపడిన వాయుగుండం. అతర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్.  మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం. దీని ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.

అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు.మంగళవారం అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం. ఆదివారం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదు.

రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Share This Article
Leave a Comment

Share with