ఇంటర్ ఫలితాలలో అన్నమయ్య జిల్లా టాపర్.. హసన్..

Bujji
2 Min Read

 అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: స్థానిక నియోజకవర్గం బి.కొత్తకోట నగర పంచాయతీ పట్టణానికి చెందిన ఓ హోటల్ లో పనిచేస్తు జీవనం సాగిస్తున్న ఇమామ్  కుమారుడైన హసన్ హెచ్ ఇ సి గ్రూప్ ఇంటర్మీడియట్ ఫలితాలలో అన్నమయ్య జిల్లా టాపర్ గా, రాష్ట్రస్థాయి లో 4 వ ర్యాంక్ సాధించినట్టు ఎంఈఓ రెడ్డి శేఖర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట రమణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ, కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం ఓ హోటల్లో చపాతి మాస్టర్ గా పనిచేస్తున్న ఇమామ్ కుమారుడైన హసన్ ది బీద కుటుంబమని వీరి నాన్న కష్టపడుతూ బిడ్డను బాగా చదివించి ప్రయోజకుడుని చేయాలని తాపత్ర పడుతున్నాడని వీరి నాన్న ఆశయాన్ని వమ్ము చేయకుండా తనలోని ప్రతిభను కనబరిచి ఈరోజు మా కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చాడని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి పదవ తరగతిలోను ఉత్తమ ప్రతిభను కనబరిచి నేడు ఇంటర్మీడియట్ లోను అవే ఫలితాలను కనబరిచాడని ఎంఈఓ, ప్రిన్సిపాల్ తెలిపారు.. మరోవైపు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు, పలమనేరు నియోజకవర్గ పరిశీలకులు పాగొండ ఖలీల్ అహ్మద్ వారి వెంట వైసిపి యువత జాబీర్ అబ్బాయిని వారి నివాసంలో కలిసి పై చదువులలో మంచి ఉత్తీర్ణత సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఖలీల్ అహ్మద్ ఆశీర్వదించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈ అబ్బాయికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే అమితమైన ఇష్టమని చాలా సందర్భాల్లో  పాఠశాలలో, కాలేజీలో ఆయన గురించి చక్కగా ఉపన్యాసాలు కూడా ఇచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు రూపు మార్చేందుకు జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా విద్యను అభ్యసించి ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలోనూ ఉపాధ్యాయుల ప్రోత్సాహం తో బాగా చదివి ప్రభుత్వ పాఠశాలల్లో , ప్రభుత్వ కళాశాలల్లో కూడా అద్భుతాలు సాధించవచ్చని జగనన్న విద్యారంగంలో చేస్తున్న అనేక సంస్కరణలు ఫలించి ఇలాంటి ఫలితాలు రావాలని ప్రతి ఒక్క విద్యార్థి ఈ అబ్బాయిని  ఆదర్శంగా తీసుకొని చదువు నేర్పిన ఉపాధ్యాయులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ లెక్చరర్ లు వెంకటేష్, రఘునాథ రెడ్డి, వెంకటేష్, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యుడు వైసీపీ యువత నక్క మహేష్, బాస్ సభ్యులు వెంకటేష్, మాధవ, సబ్జి, సచిన్, సింగన్న, గంగాధర, మణి, శ్రీనివాసులు, సురేష్, పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Share with