ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

Subhani
1 Min Read

బెల్లంకొండ,జనవరి 23, జనసేన ప్రతినిధి

మండలంలోని చండ్రాజుపాలెం గ్రామంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు ఆధ్వర్యంలో ఘనంగా యువనేత ఐటీ, విద్యశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు అందరూ కలిసి ముందుగా కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గంగారావు మాట్లాడుతూ యువ గళం కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ 2024 లో కూటమి గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు. అటువంటి మన యువ నాయకుడు జన్మదిన వేడుకలు మన గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిరాజుపాలెం సొసైటీ చైర్మన్ ఓర్చు ఆనంద్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ రాంబాబు, మణికంఠ, నితీష్ తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Share with