ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురికి గాయాలు

Kranthi
1 Min Read

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురికి గాయాలు

నల్లమాడ సెప్టెంబర్ 3 (జనసేన వార్త)  :ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నల్లమాడ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గోరంట్ల మండలం, పుట్ట గుండ్లపల్లికి చెందిన మహిళలు పని నిమిత్తం ఆటోలో నల్లమాడ మండలం రెడ్డిపల్లి కి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా నల్లమాడ సత్యమ్మ కూడలి వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొంది.ఈ ప్రమాదంలో నవిత, గంగరత్న,స్వాతికి అనే మహిళకు గాయాలయ్యాయి.

గాయపడిన వారిని స్థానికులు గుర్తించి హుటాహుటిన నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడ నుంచి వారిని పుట్టపర్తి లోని సూపర్ ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Share This Article
Leave a Comment

Share with